logo
Updated : 30/11/2021 06:05 IST

రోడ్డు ప్రమాదంలో నవ వరుడి దుర్మరణం

 విజయ్‌

రేవల్లి, న్యూస్‌టుడే : ద్విచకవాహనం అదుపుతప్పిన ఘటనలో నవ వరుడు మృతి చెందిన సంఘటన రేవల్లి మండలంలో చోటుచేసుకుంది. కేశంపేట కొత్త తండాకు చెందిన యువకుడు సభావత్‌ విజయ్‌ (23) సోమవారం ద్విచక్రవాహనంపై రేవల్లికి వచ్చి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తిరిగి వెళ్తున్నారు. గొల్లపల్లి క్రాస్‌రోడ్‌ వద్ద ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న ప్రేమయ్యను తప్పించబోయి అదుపుతప్పి విజయ్‌ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రేమయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. విజయ్‌ని  హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాత్రి 9.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  విజయ్‌కు 23 రోజులక్రితమే వివాహమైందని, అంతలోనే మృతి చెందాడని కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. 

Read latest Mahbubnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని