logo

ఎర్లీబర్డ్‌తో ఖజానాకు కాసులు

పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది.

Published : 20 May 2024 02:17 IST

భువనగిరి పట్టణం

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. ఏటా ఆర్థిక సంవత్సరం చివరలో బకాయి పన్నుపై వడ్డీ రాయితీతో పాటు ముందస్తు చెల్లింపులపై ఎర్లీబర్డ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయా పథకాలను అత్యధిక యజమానులు సద్వినియోగం చేసుకుంటుండటంతో పురపాలికల ఖజానాకు కాసులు భారీగా జమవుతున్నాయి. బకాయి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ, ఎర్లీబర్డ్‌ పథకం కింద పన్ను చెల్లింపుపై ఐదు శాతం రాయితీ ఇస్తోంది. ఆస్తిపన్ను ఎప్పుడైనా చెల్లించక తప్పదని భావించిన యజమానులు ముందస్తుగా పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందుతున్నారు. తమ ఆస్తులను అమ్ముకునే వారు, దీర్ఘకాలికంగా పన్ను చెల్లించని వారు వడ్డీ రాయితీని వినియోగించుకుంటున్నారు. పన్నుపై రాయితీల ద్వారా సమకూరుతున్న ఆదాయంతో మున్సిపాలిటీలకు నిర్వహణ పరంగా వెసులుబాటు లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు