logo
Published : 29/11/2021 02:02 IST

విషవాయువు దాటికి ఆగిన ఊపిరి

హైదరాబాద్‌లో ఘటన.. కొండమల్లేపల్లి మండలంలో విషాదం

కొండమల్లేపల్లి, గచ్చిబౌలి, న్యూస్‌టుడే: రెక్కాడితేగానీ డొక్కాడని కూలీల మరణం బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఇద్దరు కూలీలు విషవాయువుల ధాటికి ఊపిరాడక తుది శ్వాస విడిచారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలంలోని వడ్త్యతండాకు చెందిన నేనావత్‌ శ్రీనునాయక్‌(38).. ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లోని వనస్థలీపురంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం కొండాపూర్‌లోని ఐదంతస్తుల అపార్టుమెంట్‌ సెల్లార్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌, డ్రైనేజీ పైపులైను జామ్‌ కావడంతో శుభ్రం చేసే పనికి ఉల్లగొండ ఆంజయ్య(32)తో కలిసి వెళ్లారు. ట్యాంక్‌లోని మురుగు నీటిని యంత్రంతో తోడేసిన తర్వాత వ్యర్థాల పూడికను తీసేందుకు నిచ్చెన వేసి లోపలికి దిగారు. విషవాయువుల దాటికి ఊపిరాడక కొద్దిక్షణాలకే లోపల కుప్పకూలిపోయారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని బయటకు తీయగా అప్పటికే ఇద్దరూ మరణించారు. సమాచారం మేరకు బాధిత కుటుంబ సభ్యులు చేరుకుని తమకు న్యాయం చేసేవరకూ మృతదేహాలు తరలించొద్దని వారించారు. పోలీసులు హామీ తర్వాత ఆందోళన విరమించారు. శ్రీనునాయక్‌కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారని గ్రామ సర్పంచి తెలిపారు. గ్రామంలోని ప్రతీవేడుకకు హాజరై కలుపుగోలుగా మెదిలే శ్రీనునాయక్‌ మృతి గ్రామంలో తీవ్రవిషాదాన్ని నింపింది.  

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని