logo
Published : 29/11/2021 02:54 IST

విద్యార్థులు.. ప్రయాణ ప్రయాసలు

మర్రిగూడ చౌరస్తాలో బస్సు కోసం నిరీక్షిస్తున్న భీమనపల్లి విద్యార్థులు (పాతచిత్రం)

మర్రిగూడ, న్యూస్‌టుడే: మండల కేంద్రం నుంచి వట్టిపల్లి, భీమనపల్లి, కమ్మగూడెం, లెంకలపల్లి గ్రామాలకు రాకపోకలకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకటే ఆర్టీసీ బస్సు ఉంది. ఉదయం పూట నల్గొండ నుంచి మాల్‌కు వయా మర్రిగూడకు ఈ బస్‌ వస్తుంది. మార్గమధ్యలో ఈ గ్రామాలకు దాదాపు 8:30గం.కు చేరుకుంటుంది. విద్యార్థులు ఈ బస్సులోనే మర్రిగూడలోని పాఠశాలలకు, కళాశాలలకు వస్తుంటారు. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు మర్రిగూడకు సాయంత్రం 4.30 ప్రాంతంలో చేరుతుంది. కానీ పాఠశాలలు 4:45గం.కు విడిచి పెడతారు. విద్యార్థులు పాఠశాలల నుంచి ప్రయాణ ప్రాంగణానికి ఒక కి.మీ నడిచి వచ్చే సరికి బస్సు వెళ్లిపోతుంది. గ్రామాలకు వెళ్లడానికి మరో బస్సు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామాల నుంచి కుటుంబీకులు వచ్చి వీరిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని