logo

గుంతల రోడ్లు... పూడిన కాలువలు

షబ్బీర్‌ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published : 25 Apr 2024 02:34 IST

రాళ్లుతేలి అధ్వానంగా ఉన్న సీసీ రోడ్డు

ఉదయగిరి, న్యూస్‌టుడే: షబ్బీర్‌ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • దిలావర్‌భాయ్‌వీధిలో మురుగు వ్యవస్థ సరిగా లేదు. ఇళ్ల ముందు రోడ్లపై మురుగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు స్థానికులు తంటాలు పడుతున్నారు. మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది.
  • నాగులబావి, అగ్రహారం వీధుల్లో సీసీ రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి. డ్రైనేజీ చెత్తాచెదారాలతో నిండి రోడ్లపై ప్రవాహం సాగుతోంది. పంచాయతీ ద్వారా నీటి సరఫరా నిత్యం అందుబాటులోఉండటంలేదు. కోళ్ల, సుద్దబావి వీధుల్లో సైతం డ్రైనేజీ సరిగా లేదు.
  • చెత్త నిర్వహణ లేక రోడ్ల పక్కన, జనావాసాల మధ్య చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. చెత్తకుండీలు ఏర్పాటు చేయలేదు.

పక్కకాలువలు లేవు  - షరీఫ్‌

పట్టణంలో పక్క కాలువలు సరిగా లేవు. దీంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. కాలువల్లో పూడిక, చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. చెత్త వేసేందుకు వీధుల్లో కుండీలు లేవు. పాలకులు, అధికారులు చర్యలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి.

రోడ్లు అధ్వానం  - మహమ్మద్‌ షఫీ

పట్టణంలో సీసీ రోడ్లు రాళ్లు తేలి, గుంతలతో ప్రమాదకరంగా మారాయి. వాటిపై రాకపోకలు సాగించలేకపోతున్నాం. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.

ప్రాంతాలు: దిలావర్‌భాయ్‌ వీధి, అగ్రహారం, షబ్బీర్‌ కాలనీ, నాగులబావి వీధి, సుద్దబావి వీధి, కోళ్ల వీధి
సమస్యలు: తాగునీరు, పారిశుద్ధ్యం, అధ్వానపు రోడ్లు, అస్తవ్యస్తంగా మురుగు కాలువ వ్యవస్థ
పంచాయతీ: ఉదయగిరి
వార్డులు: 10, 11, 12, 13
జనాభా: సుమారు 4,106

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు