logo

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 25 Apr 2024 03:45 IST

రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు నామ పత్రాలు అందజేస్తున్న  నిజామాబాద్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి, చిత్రంలో బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌, ఈరవత్రి అనిల్‌, ఏ.లలిత

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, మాజీ ఎమ్మెల్సీ ఏ.లలితతో కలిసి రెండు సెట్ల నామ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణుతో కలిసి మరో రెండు సెట్‌ వేశారు.

భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ తరఫున నామినేషన్‌ వేస్తున్న పార్టీ ప్రతినిధులు పల్లె గంగారెడ్డి, దినేష్‌, ప్రకాష్‌రెడ్డి, స్రవంతి, బోగ శ్రావణి

భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ తరఫున పార్టీ నాయకులు పల్లె గంగారెడ్డి, దినేష్‌ కులాచారి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, స్రవంతిరెడ్డి, బోగ శ్రావణి మూడో సెట్‌ నామ పత్రాలు అందజేశారు. బీఫాం అందజేశారు. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ తరఫున ఆయన కొడుకు బాజిరెడ్డి జగన్‌, నాయకులు నాలుగో సెట్‌ పత్రాలు దాఖలు చేశారు. రాజ్‌కుమార్‌(ఇండియా ప్రజాబంధు పార్టీ), పానుగంటి రజిత వాణి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), నాగార్జున(ప్రజాసేన పార్టీ) నామినేషన్‌ వేశారు. స్వతంత్రులు రాజేందర్‌, గంగాధర్‌, నవీన్‌, రఘు, ఎం.డి. షాహెద్‌ ఖాన్‌(ఆలిండియా నేషనల్‌ పార్టీ) అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. పార్లమెంట్‌ స్థానానికి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు 62 సెట్ల నామినేషన్‌ పత్రాలు వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.

నేటితో ఆఖరు: నామినేషన్‌ దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 18 నుంచి నామ పత్రాల స్వీకరణ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలైన భారాస, భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీతో కలిసి గురువారం మరో సెట్‌ వేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు