logo

టీఎస్‌ కాస్తా టీజీగా..

తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్‌గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్‌ హెడ్‌లపై టీఎస్‌కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది.

Published : 20 May 2024 03:24 IST

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్‌గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్‌ హెడ్‌లపై టీఎస్‌కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇస్తూ గెజిట్‌ జారీ చేసిందని తెలిపింది. గతంలో అధికారంలో ఉన్న భారాస సర్కార్‌ టీఎస్‌(తెలంగాణ స్టేట్‌)గా పేర్కొంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, ప్రభుత్వ పరంగా టీఎస్‌గా రాసేవారు. గతేడాది డిసెంబరులో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో మొదట వాహనాల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి టీఎస్‌ తొలగించి టీజీగా మార్చింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మార్పు చేయాలని పేర్కొంది.

26లోపు మార్పు చేయాలి 

రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా పాలనాధికారి

ప్రభుత్వ శాఖలన్నీ రాష్ట్రాన్ని సంక్షిప్తంగా టీజీగా రాయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల బోర్డులు, అధికారిక లెటర్‌ హెడ్‌లపై టీజీగా మార్చాలి. ఇందుకు ఈ నెల 26 వరకు గడువు ఇస్తున్నాం. మార్పు చేసినట్లు ఏ రోజుకారోజు నివేదికలు పంపాలి. గడువులోపు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని