logo

ఇంటికి పిలిచి.. సన్నిహితంగా ఉన్నట్లు నటించి..

ఫేస్‌బుక్‌ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని తర్వాత వారిని ఇంటికి పిలిచి దాడి చేసి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Updated : 18 Sep 2023 09:47 IST

దోచుకుంటున్న ముఠా అరెస్టు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని తర్వాత వారిని ఇంటికి పిలిచి దాడి చేసి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీసీపీ ప్రతీక్‌ సింగ్‌ విలేకరులకు అందించిన వివరాల ప్రకారం... భువనేశ్వర్‌ తమాండొ పోలీస్‌ స్టేషన్లో నమోదైన కేసుపై దర్యాప్తు జరిపి ఈ ముఠాను అరెస్టు చేశారు. ఇరానీ పాత్ర్‌ అనే మహిళ, ఆమె భర్త రవి పాత్ర్‌ ముఠాలో ప్రధాన పాత్ర పోషించేవారు. ఇరానీ పాత్ర్‌ తన ఫొటోలను పేస్‌బుక్‌లో ఉంచి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపేది. దానిని అంగీకరించినవారి ఫోన్‌ నెంబరు తీసుకొని రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపేది. తర్వాత వారికి ఇంటికి పిలిచేది. అలా వెళ్లిన యువకుడ్ని ఏసీ గదిలో కూర్చోబెట్టేది. తర్వాత ఆయనతో కొంత సన్నిహితంగా ఉన్నట్లు నటించేది. అప్పటికే అక్కడున్న ఇద్దరు యువకులు రహస్యంగా ఈ దృశ్యాలను చిత్రీకరించేవారు. తర్వాత వారిద్దరూ వచ్చి ఆయనను మారణాయుధాలతో బెదిరించి బంగారం, డబ్బు దోచుకొనేవారు. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి మరికొంత తీసుకునేది. భువనేశ్వర్‌కి చెందిన యువకుని భార్యకు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3.60 లక్షలు కాజేసినట్లు మరో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు ముఠాను అరెస్టు చేయడంతో వివిధ పోలీస్‌ స్టేషన్లలో వీరిపై నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని