logo

పాదయాత్రలు.. ఇంటింటా ప్రచారాలు

బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా  ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.

Published : 23 Apr 2024 02:43 IST

పాదయాత్ర చేస్తూ ప్రజలకు నమస్కరిస్తున్న భాజపా అభ్యర్థి అనిల్‌ కుమార్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా  ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట స్థానిక తెలుగు ప్రముఖులున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీఈఎంసీ మాజీ మేయరు శిబశంకర దాస్‌ (పింటు దాస్‌) ఆదివారం రాత్రి బెజ్జిపురం ప్రాంతంలోని బజార్లు, వీధుల్లో ప్రజల్ని కలిసి తాను చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. బిజద అభ్యర్థి డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌ బిజు పరివార్‌తో కలిసి రాత్రి గొల్లపల్లి ప్రాంతంలో పాదయాత్రలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని