logo

మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక

బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది.

Published : 24 Apr 2024 01:27 IST

సమావేశంలో మిత్ర మండలి ప్రతినిధులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. ఖస్పావీధిలో శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానం ఆవరణలోని మిత్ర మండలి పఠనాగారంలో పోలాకి శ్రీరామమూర్తి అధ్యక్షతన ఇది ఏర్పాటైంది. 2024-26 సంవత్సరాలకు మిత్ర మండలి నూతన అధ్యక్షునిగా ఎన్‌.సత్యనారాయణమూర్తి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా ఆర్‌.శ్రీనివాస్‌, కార్యదర్శిగా కె.ఆనంద్‌ నరసింహ సుబుద్ధి, సంయుక్త కార్యదర్శిగా కానూరు గోపాలకృష్ణ, కోశాధికారిగా టి.శివప్రసాదరావు ఎంపికయ్యారు. నూతన కార్యవర్గాన్ని మిత్రమండలి ప్రతినిధులు అభినందించారు. సమావేశంలో తుర్లపాటి రాజేశ్వరి, పూడిపెద్ది సత్యనారాయణ (బాబు), కె.శివప్రసాద్‌ సుబుద్ధి, కె.కాశీవిశ్వనాథం సుబుద్ధి, జె.షణ్ముఖరావు, వి.బలరామరాజు, బి.శివప్రసాద్‌రావు తదితరులు పాల్గొని మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని