logo

గోపాల్‌పూర్‌లో ముఖాముఖి పోరు

ప్రతిష్ఠాత్మక గోపాల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది.

Published : 24 Apr 2024 01:32 IST

స్థానిక సమస్యలే ప్రచారాస్త్రాలు

కమలాపురంలో తెలుగు పెద్దల సభలో మాట్లాడుతున్న బిక్రం పరిడ

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మక గోపాల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ నిలబెట్టిన శ్యాంసుందర్‌ సాహు పోటీ నామమాత్రంగా ఉండగా, బిక్రం పండా (బిజద), బిభూతి భూషణ జెనా (భాజపా) పోటీ నువ్వా?నేనా? అన్న రీతిలో ఉంది.

దివ్యాంగునికి ఓటు అర్థిస్తున్న బిభూతి భూషణ్‌ జెనా

మత్స్యకారులే నిర్ణయాత్మకం..: గోపాల్‌పూర్‌లో అభ్యర్థుల విజయానికి మత్స్యకారులు నిర్ణయాత్మకమవుతున్నారు. వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారు. ఈసారి గంగపుత్రులను తమవైపునకు తిప్పుకోవడానికి బిజద, భాజపా అభ్యర్థులిద్దరూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో తీర పట్టణంలో ఎన్నికల వేడి తీవ్రమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని