logo

భేష్‌.. ముహూర్త బలం

శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట..

Published : 19 Apr 2024 03:58 IST

నేడే అత్యధిక నామినేషన్లు

శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట..

ఈనాడు, విజయనగరం , న్యూస్‌టుడే, అర్బన్‌: ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆ  ప్రకారం.. రెండు జిల్లాలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పదకొండు శాసనసభ స్థానాలకు ప్రధాన పార్టీల నుంచి 22 మంది అభ్యర్థుల పేర్లు ఖరారవ్వగా రెండో రోజు శుక్రవారం పది మంది నామినేషన్లు దాఖËలు చేస్తారు. తొలిరోజు నెలిమర్లలో నామినేషన్‌ వేసిన వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుతో కలుపుకొంటే రెండు రోజుల్లోనే 11 మంది పూర్తి చేసినట్లవుతుంది. ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ 19 నుంచి 25 వరకు మిగిలిన 11 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముహూర్తం నిర్ణయించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు (తెదేపా), బెల్లాన చంద్రశేఖర్‌ (వైకాపా), నియోజకవర్గాల వారీగా.. నెల్లిమర్ల- లోకం నాగమాధవి, గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్‌, రాజాం - కోండ్రు మురళీమోహన్‌, చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ, గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య,  బొబ్బిలి   - శంబంగి చిన అప్పలనాయుడు, ఎస్‌.కోట - కడుబండి శ్రీనివాసరావు, కురుపాం- పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ- కళావతి, సాలూరు     - రాజన్నదొర (ముహూర్తానికి తొలిసెట్‌) శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని