logo

స్ట్రాంగ్‌ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు

విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 19 May 2024 03:52 IST

పి.వెంకటరమణ 

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వో లేని సమయంలో ఏఆర్వో అధికార పార్టీకి చెందిన బయట వ్యక్తులను ఎలా స్ట్రాంగ్‌ రూంలోకి అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూం విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, పోటీలో ఉన్న అభ్యర్థులందర్నీ పిలిచి సమావేశం నిర్వహించి అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈసీ చర్యలు తీసుకోవాలి: గీత

విజయనగరం అర్బన్‌: తహసీల్దారు కార్యాలయంలో అనధికార వ్యక్తుల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌రూంను తెరవడంపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైకాపా నాయకులు చరవాణితో స్ట్రాంగ్‌ రూంలోకి వెళ్లి బ్యాలెట్లను తరలించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. స్థానిక అధికారులు వైకాపాతో కుమ్మక్కై తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని