logo
Published : 28/11/2021 04:27 IST

సుప్రసిద్ధ కళాకృతుల ప్రదర్శన

డిసెంబరు ఒకటి, రెండు తేదీల్లో

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌(సి.సి.ఎ.పి.) ఆధ్వర్యంలో డిసెంబరు ఒకటి, రెండు తేదీల్లో ‘వసంతం’ పేరుతో చేనేత, హస్తకళలు, డిజైనర్‌ వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన భారీ స్థాయిలో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, అసోం తదితర రాష్ట్రాలకు చెందిన సుప్రసిద్ధ కళాకృతులు, హస్తకళల ఉత్పత్తులు తాజా ప్రదర్శనలో ప్రత్యేకంగా కొలువుదీరబోతున్నట్లు తెలిపారు. సంప్రదాయ బెనారస్‌, ఖాదీ, చేనేత వస్త్రాలతోపాటు మహిళలు మెచ్చే ఎన్నో రకాల హ్యాండ్‌బాగులు, కళాకృతులు కూడా ఉంటాయన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌లకు చెందిన హస్తకళలు, చేనేత ఉత్పత్తులు సందర్శకులను కనువిందు చేస్తాయని వెల్లడించారు. స్థానిక చేనేత కళాకారులు, నేత కార్మికుల ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. స్థానిక సంప్రదాయ చేనేత, హస్తకళల పురోగతికి, అభివృద్ధికి సి.సి.ఎ.పి. చేస్తున్న కృషిలో భాగంగా తాజా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  కొవిడ్‌ కారణంగా 2020లో నిర్వహించలేకపోయామని వివరించారు. ఈసారి నగరంలోని గ్రీన్‌పార్క్‌ హోటల్లో డిసెంబరు ఒకటి, రెండు తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని