logo

9 నెలలుగా జీతాల్లేవ్‌!

అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్‌ సెంటర్‌)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 20 May 2024 04:03 IST

వ్యసన విముక్తి కేంద్రం సిబ్బంది ఆవేదన

కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్‌ సెంటర్‌)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. మద్యం బారిన పడిన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు అనారోగ్యం పాలైన వారికి చికిత్స అందించేలా ఈ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వైద్యుడితో పాటుగా ఆరుగురు సిబ్బంది కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు కౌన్సెలర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వార్డు బాయ్స్‌ ఉన్నారు. వీరికి దాదాపుగా తొమ్మిది నెలల నుంచి జీతాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వీరికి జీతాలు చెల్లింపుపై ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులను అడుగుతుంటే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఏమి చేయాలో పాలు పోని స్థితిలో సిబ్బంది ఉన్నారు.

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

తమకు జీతాలు రావడం లేదని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ రవికి ఇక్కడి సిబ్బంది ఫిర్యాదు చేశారు. తొమ్మిది నెలలుగా జీతాలు రాకపోవడంతో పడుతున్న ఇబ్బందులను అందులో వివరించారు. తమ గోడు వినిపించుకునే వారే కరవయ్యారని తమ జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని