Published : 01 Dec 2021 06:09 IST
భావితరాలకు ఆదర్శం గురజాడ
నివాళులర్పిస్తున్న కలెక్టర్, డిప్యూటీ మేయర్, జేసీ, గురజాడ కుటుంబ సభ్యులు
గంటస్తంభం/కంటోన్మెంట్, న్యూస్టుడే: గురజాడ వేంకట అప్పారావు తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ ఎ.సూర్యకుమారి కొనియాడారు. మంగళవారం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆయన నివాసంలో అప్పారావు చిత్రపటానికి, విగ్రహానికి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావుతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ కుటుంబ సభ్యులు ప్రసాద్, ఇందిర, లలితను సత్కరించారు. వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠనం, కవితల పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
Tags :