logo
Published : 02 Dec 2021 08:03 IST

Crime News: మిత్రులతో కలిసి భార్యను కిడ్నాప్‌ చేసిన భర్త

గోవిందరావుపేట, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్యను మిత్రులతో కలిసి భర్త కిడ్నాప్‌ చేసిన సంఘటన బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గోవిందరావుపేటకు చెందిన శాంతి(21)ని ఆమె భర్త చంద్రగిరి బాలరాజు తన స్నేహితులతో కలిసి రెండు కార్లలో వచ్చి జాతీయరహదారి వెంట ఉన్న తన మామయ్య ఇంట్లోకి చొరబడి శాంతిని బలవంతంగా తీసుకెళ్లాడు. అడ్డుపడిన అత్త రజిని, బావమరిది సృజన్‌ను పక్కకు నేట్టేసి కార్లో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. పస్రా ఎస్సై సీహెచ్‌.కరుణాకర్‌రావు కథనం ప్రకారం.. గోవిందరావుపేటకు చెందిన దామల్ల సుధాకర్‌, రజిని దంపతులు వృత్తి రీత్యా హనుమకొండలో నివాసం ఉండేవారు. హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చేస్తున్న వారి కూతురు శాంతి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన బాలరాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో గత ఏప్రిల్‌లో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత వారి కాపురంలో కలతలు ఏర్పడి శాంతి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులతో విషయం చెప్పగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుదామన్నారు. ఇంతలో ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు సుధాకర్‌ కుటుంబ సభ్యులందరూ వెళ్లగా బాలరాజు తన స్నేహితులతో కలిసి శాంతిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ మేరకు ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు కూడా నమోదైంది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటి నుంచి తప్పించుకొని శాంతి పుట్టింటికి చేరుకుంది. నర్సింగ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత మాట్లాడి పంపిస్తామమని ఆమె తల్లిదండ్రులు బాలరాజుకు చెప్పారు. అయినా వినకుండా బాలరాజు బుధవారం స్నేహితులతో కలిసి శాంతిని కిడ్నాప్‌ చేశాడు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.

Read latest Warangal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని