logo

ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి

వచ్చేనెల 13న జరగబోయే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పిలుపునిచ్చారు.

Published : 20 Apr 2024 01:54 IST

గాల్లోకి బెలూన్లు వదులుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, అధికారులు

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వచ్చేనెల 13న జరగబోయే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు శుక్రవారం హనుమకొండ అదాలత్‌ కూడలిలో ఓటు ప్రాముఖ్యతపై మానవ హారం, అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు బధిరులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం సాంస్కృతిక కళాకారులు ఆటపాటలతో అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు వెంకట్‌రెడ్డి, రాధిక గుప్తా, శిక్షణ కలెక్టర్‌ శ్రద్దాశుక్లా, డీఆర్‌డీవో నాగపద్మజ, జిల్లా సంక్షేమాధికారి మధురిమ, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు..

ధర్మసాగర్‌ : ధాన్యాన్ని నిబంధనల మేరకే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. శుక్రవారం ధర్మసాగర్‌, నారాయణగిరి, వేలేరులోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, శిక్షణా కలెక్టర్‌ శ్రద్దాశుక్లాతో కలిసి పరిశీలించారు. ఎక్కువ ధాన్యం తూకం వేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో తూకం వేసి పెట్టిన బస్తాను మళ్లీ కాంటా వేయించగా.. 42 కిలోల 400 గ్రాములు వచ్చింది. 40 కిలోల 750 గ్రాములే తూకం వేయాలని కలెక్టర్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని