logo

దేశం గర్వించేలా మోదీ పాలన

కాంగ్రెస్‌ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్‌ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 02 May 2024 06:10 IST

పర్వతగిరిలో మాట్లాడుతున్న అరూరి రమేశ్‌ చిత్రంలో నాయకులు రాజేశ్వర్‌రావు, కొండేటి శ్రీధర్‌, ప్రదీప్‌రావు

పర్వతగిరి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్‌ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రచారానికి వచ్చిన అరూరికి కార్యకర్తలు బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లతో పెద్దఎత్తున స్వాగతం పలికారు. అరూరి ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ప్రధానిగా మోదీ దేశం గర్వించేలా సేవలందించారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు తనను రెండుసార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం కుట్రలతోనే తాను ఓడానని ఆరోపించారు. మాదిగలను వెన్నుపోటు పొడవడంలో కడియం సిద్ధహస్తుడని విమర్శించారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పనిచేసిన కడియంను ప్రజలు విశ్వసించడంలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి చేస్తున్న భాజపాను గెలిపించాలని కోరారు. సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వర్‌రావు, కొండేటి శ్రీధర్‌, వరంగల్‌ తూర్పు భాజపా ఇన్‌ఛార్జి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, హనుమకొండ జిల్లా జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ శ్రీరాములు, నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీధర్‌, రాజేశ్వర్‌రావు, బన్న ప్రభాకర్‌, శ్రీనివాస్‌నాయక్‌, ఏకాంతం, మధు తదితరులు పాల్గొన్నారు.

ఏనుగల్లులో భారీ ర్యాలీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని