logo

వరంగల్‌ తొలి ఎంపీ సాదత్‌ అలీఖాన్‌

1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి హైదరాబాద్‌కు చెందిన సాదత్‌ అలీఖాన్‌ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) అభ్యర్థిగా పోటీ చేశారు.

Published : 24 Apr 2024 02:59 IST

‘మన ఎంపీలు’

న్యూస్‌టుడే, నర్సంపేట: 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి హైదరాబాద్‌కు చెందిన సాదత్‌ అలీఖాన్‌ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థి పెండ్యాల రాఘవరావుపై 14,955 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అలీఖాన్‌కు 1,07,249 ఓట్లు రాగా, పెండ్యాల రాఘవరావుకు 92,294 ఓట్లు వచ్చాయి. సాదత్‌ అలీఖాన్‌ కేవలం రాజకీయ నాయకుడే కాదు.. పాత్రికేయుడు, రచయిత కూడా. ఉర్దూలో పద్యాలు రాశారు. ఆంగ్లంలో రచించిన పద్యాలను ఉర్దూలోకి అనువదించారు. తన జ్ఞాపకాలను ‘బ్రీఫ్‌ థాంక్స్‌ గివింగ్‌’ పేరుతో 1959లో రచించారు. అంతకు ముందు ఆయన భారత ప్రభుత్వ కార్యదర్శిగా, టర్కీ, ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో పని చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని