logo

జజ్జనకర.. జనజాతర

కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

Updated : 25 Apr 2024 06:05 IST

ఉత్సాహంగా కాంగ్రెస్‌ బహిరంగ సభ

అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, వరంగల్‌,  మడికొండ, న్యూస్‌టుడే: కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి సాయంత్రం సభకు తరలివచ్చారు. రేవంత్‌రెడ్డి రాకతో జనం ఒక్కసారి హుషారుగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ నేతలు ప్రసంగించాక రేవంత్‌రెడ్డి అరగంటకుపైగా మాట్లాడి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారాస, భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల తర్వాత కోడ్‌ ముగిశాక ఓరుగల్లును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లుకు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇస్తామని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీతోపాటు పారిశ్రామిక కారిడార్‌గా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని, అసెంబ్లీలో ప్రజలు పది స్థానాల్లో గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని, మరో మారు లోక్‌సభలో అభ్యర్థి కడియం కావ్యను ఆశీర్వదించాలని కోరారు.  

కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని