logo

‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’

ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో  కేసముద్రం మార్కెట్‌ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు.

Published : 17 May 2024 03:38 IST

రాస్తారోకో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ , భారాస నేతలు, కార్యకర్తలు

కేసముద్రం, న్యూస్‌టుడే:  ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో  కేసముద్రం మార్కెట్‌ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ధాన్యానికి రూ.500 బోనస్‌ చెల్లిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం సన్నరకం ధాన్యానికి మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో కేసముద్రం, వరంగల్‌ ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనలో భారాస నాయకులు గుగులోతు వీరూనాయక్‌, నీలం దుర్గేశ్‌, మోడెం రవీందర్‌, ఊకంటి యాకూబ్‌రెడ్డి, కొండ్రెడ్డి రవీందర్‌రెడ్డి, మిట్టగడుపుల మహేందర్‌, చంద గోపి, సుమన్‌, మంగీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు