logo

బాదంపూడి సొసైటీలో గోల్‌మాల్‌పై విచారణ

ఉంగుటూరు మండలం బాదంపూడి విశాల సహకార సంఘం (సొసైటీ)లో నగదు గోల్‌మాల్‌ వ్యవహారంపై సొసైటీ ఛైర్‌పర్సన్‌ మల్లారెడ్డి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సొసైటీ కార్యదర్శి బొగనబోయిన వేణుగోపాల్‌పై కేసు నమోదు చేశామని చేబ్రోలు పోలీసులు

Published : 27 May 2022 03:43 IST

ప్రధాన సూత్రధారుడైన కార్యదర్శిపై కేసు నమోదు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు మండలం బాదంపూడి విశాల సహకార సంఘం (సొసైటీ)లో నగదు గోల్‌మాల్‌ వ్యవహారంపై సొసైటీ ఛైర్‌పర్సన్‌ మల్లారెడ్డి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సొసైటీ కార్యదర్శి బొగనబోయిన వేణుగోపాల్‌పై కేసు నమోదు చేశామని చేబ్రోలు పోలీసులు గురువారం తెలిపారు. మార్చి 23న నగదు గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగుచూసిన విషయం విదితమే. ఏలూరు సబ్‌ డివిజనల్‌ కోఆపరేటివ్‌ అధికారి మద్దుకూరి నరసింహరాజు ప్రాథమిక విచారణ చేపట్టి డీసీవోకి అందజేసిన నివేదిక ఆధారంగా రూ.1,20,87,572 గోల్‌మాల్‌ జరిగిందని సొసైటీ ఛైర్‌పర్సన్‌ శేషగిరిరావు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి సబ్‌ డివిజన్‌ సహాయ రిజిస్ట్రార్‌ తీట్ల లక్ష్మణరావు విచారణ చేస్తున్నారు. నగదు గోల్‌మాల్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడైన సొసైటీ కార్యదర్శి వేణుగోపాల్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని