logo

నిర్వాసితులను నిలువునా ముంచారు

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Updated : 30 Apr 2024 06:52 IST

పరిహారం ఇవ్వకుండా మోసగించిన జగన్‌

కొయ్యలగూడెం సభలో షర్మిల వ్యాఖ్యలు

 మాట్లాడుతున్న షర్మిల, చిత్రంలో ఎలీజా, లావణ్య, సృజన తదితరులు

 కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కొయ్యలగూడెంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన న్యాయ యాత్రలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఎకరా రూ.20 లక్షలు ఉందని ముఖ్యమంత్రి ఇస్తానన్న పరిహారం సరిపోతుందా అన్ని ప్రశ్నించారు. ముంపు బాధితులకు కాలనీలు కట్టిస్తామని చెప్పారని, అది కూడా చేయలేదన్నారు. గత పదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.

 ఇక్కడి ఎమ్మెల్యే ఇసుక బాలరాజు.. ఇక్కడి ఎమ్మెల్యే ఇసుక బాలరాజు అంట కదా.. ఇసుక దోచేశారట.. మట్టి మాఫియా చేశాడట.. ఆయనకు చెడ్డ పేరు వచ్చిందని భార్యకు సీటిచ్చారట.. ఇదేం లాజిక్కో నాకర్థం కావడం లేదు. ఎవరైతే ఏంటీ.. దోపిడీకి అని షర్మిల ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందో, లేదో తెలుసుకుని ప్రజలు ఓట్లు వేయాలన్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న ఎంపీ అభ్యర్థిని కావూరి లావణ్య, పోలవరం అభ్యర్థిని దువ్వెల సృజనలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థిని కావూరి లావణ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం వైకాపా, తెదేపాలకు లేదన్నారు.  చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణచైతన్య, సీపీఎం జిల్లా కార్యదర్శి రవి, డీసీసీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని