logo
Published : 02/12/2021 05:42 IST

అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించండి


మాట్లాడుతున్న గుంటూరు, కృష్ణా జిల్లాల రోల్‌ అబ్జర్వర్‌ కేవీ రమణ

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: స్పెషల్‌ సమ్మరి రివిజన్‌-2022 సందర్భంగా ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 20వ తేదీ లోగా పరిష్కరించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల రోల్‌ అబ్జర్వర్‌ కె.వి.రమణ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో బుధవారం ఓటర్ల నమోదుకు సంబంధించి జరుగుతున్న స్పెషల్‌ సమ్మరి రివిజన్‌పై అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్షించారు. రోల్‌ అబ్జర్వర్‌ కె.వి.రమణ మాట్లాడుతూ పెదకూరపాడు, చిలకలూరిపేట, మంగళగిరిలలో ఎక్కువగా వచ్చిన క్లెయిమ్‌లను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. డీఆర్‌వో పి.కొండయ్య ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, కె.శ్రీధర్‌రెడ్డి, తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధి మీనా, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ, ఆర్డీవోలు, ఈఆర్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని