logo
Published : 04/12/2021 03:25 IST

‘డీలర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’

మాట్లాడుతున్న వెంకట్రావ్‌, పక్కన సంఘ నాయకులు

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు ఎంఎల్‌ఎస్‌ కేంద్రంలో జరిగిన బియ్యం కుంభకోణంలో తీవ్రంగా నష్టపోయిన రేషన్‌ డీలర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చౌకధరల దుకాణదారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావ్‌ అన్నారు. కుంభకోణం జరిగిన గోదాములను రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు మండలాల్లో 132 మంది డీలర్లకు సుమారు 11,000 బస్తాలు ఇవ్వాల్సి ఉందని అన్యాయానికి గురైన వీరి సమస్యలను పరిష్కరించాలని అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎంఎల్‌ఎస్‌ కేంద్రం నుంచి సక్రమంగా సరకులను పంపిణీ చేయకుండా విడతల వారీగా అందిస్తూ తమ వద్ద నిల్వ ఉన్న బియ్యాన్ని లబ్థిదారులకు ముందు పంపిణీ చేయాలంటూ జిల్లా, మండల స్థాయి అధికారులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. ఇటువంటి చర్యలతోనే బియ్యం పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. అవినీతికి ప్రధాన కారకుడైన గోదాము ఇన్‌ఛార్జి హుళకేశ్వరరావు, ఆయన సిబ్బంది చేసిన అక్రమాలను బహిర్గతం చేసి నష్టపోయిన డీలర్లకు పూర్తిశాతం బియ్యం, కందిపప్పు, పంచదారను అందించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరగని పక్షంలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కార్యదర్శి పసుపులేటి శివప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు ముత్యాల శేషగిరిరావు, కలిదిండి, మండవల్లి, కైకలూరు మండలాల డీలర్ల సంఘం అధ్యక్షులు నాగరాజు, జయరాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని