logo
Published : 08 Dec 2021 05:13 IST

భవానీ దీక్షల విరమణకు పటిష్ఠ ఏర్పాట్లు

మట్లాడుతున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పక్కన సెంట్రల్‌ ఎమ్మెల్యే విష్ణు, మేయర్‌ భాగ్యలక్ష్మి, కలెక్టర్‌ నివాస్‌,
మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్నవెంకటేష్‌, జేసీ మాధవీలత, ఈఓ భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు

విద్యాధరపురం, న్యూస్‌టుడే : భవానీ దీక్షల విరమణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై ఇరిగేషన్‌ కాంపౌండ్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో సమన్వయ సమావేశాన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ ఈ నెల 18న నిర్వహించే కలశజ్యోతుల ఊరేగింపునకు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ ఘాట్ల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు, కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయడంతోపాటు దీక్షా వస్త్రాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భవానీ దీక్షాధారులకు ఐదురోజుల పాటు ఉచిత దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. వేకువ జామున 3 నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులు గిరిప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించామన్నారు. దేవస్థానం ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ ఐదు రోజులకు 15 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ భాగ్యలక్ష్మి, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌, జేసీలు మాధవీలత, మోహన్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, డీసీపీ బాబూరావు, ఏసీపీలు హనుమంతరావు, రామచంద్రరావు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని