logo

Karnataka: దయలేని పుత్రుడు

ఇంటిని తనపేరుమీద రాయలేదనే అక్కసుతో ఓ తనయుడు తన తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన సంఘటన రామనగరకు సమీపంలోని సింగ్రాబోవిలో కన్నీరు తెప్పించిన అంకం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనను స్థానికులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. ఆర్టీసీలో డ్రైవర్‌గా

Updated : 09 Jul 2021 08:13 IST


తండ్రిని ఇంట్లో నుంచి బయటకు నెడుతున్న తనయుడు

రామనగర, న్యూస్‌టుడే : ఇంటిని తనపేరుమీద రాయలేదనే అక్కసుతో ఓ తనయుడు తన తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన సంఘటన రామనగరకు సమీపంలోని సింగ్రాబోవిలో కన్నీరు తెప్పించిన అంకం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనను స్థానికులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే కుమార్‌ అనే వ్యక్తి తన పేరుతో ఇంటిని రాయలేదనే కోపంతో తండ్రిని నిత్యం సతాయించాడు. ఇటీవల అనారోగ్యంతో మంచానపడిన తండ్రిని బలవంతంగా బయటకు నెట్టాడు. ఆ వ్యక్తి దుశ్చర్యను స్థానికులు వీడియో తీశారు. బయటకు నెట్టేసిన సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా అందింది. పోలీసులు జోక్యం చేసుకుని తనయుడిని మందలించడంతో.. విధిలేక తిరిగి తండ్రిని ఇంట్లోకి రానిచ్చాడని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని