logo

Andhra News: ప్రత్యూష పెళ్లికూతురాయెనే!

చెస్‌ ఉమెన్‌ గ్రాండ్‌మాస్టర్‌ బొడ్డా ప్రత్యూష, కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ వంగలపూడి రవితేజ మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు.

Updated : 14 Apr 2022 07:05 IST

చెస్‌ ఉమెన్‌ గ్రాండ్‌మాస్టర్‌ వివాహం నేడు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: చెస్‌ ఉమెన్‌ గ్రాండ్‌మాస్టర్‌ బొడ్డా ప్రత్యూష, కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ వంగలపూడి రవితేజ మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని జగతా అప్పారావు కల్యాణ మండపం వేదికగా గురువారం వీరి వివాహం జరగనుంది. ప్రత్యూష స్వస్థలం పాయకరావుపేట మండలం మంగవరం. తండ్రి ప్రసాద్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి సత్యాదేవి గృహిణి. నాలుగేళ్ల వయసు నుంచే చెస్‌ ఆడుతున్న ప్రత్యూష ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదిగారు. అండర్‌-9 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌, అండర్‌-12, 14, 16, 18 విభాగాల్లో కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అండర్‌-16 ఏషియన్‌ ఛాంపియన్‌, 2016లో ఒలింపియాడ్‌ టీం మెంబర్‌గా ఎంపికైంది. ప్రస్తుతం హైదరాబాదులో ప్రత్యూష ఇంటర్నేషనల్‌ చెస్‌ అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని