అధికారులే గుత్తేదారులై
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చులకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయి. కొందరు అధికారులే గుత్తేదారుల అవతారమెత్తి జేబుల్లో వేసుకున్నారు.
ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో గోల్మాల్
నకిలీ బిల్లులు, బినామీలతో రూ.కోట్లలో దందా
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చులకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయి. కొందరు అధికారులే గుత్తేదారుల అవతారమెత్తి జేబుల్లో వేసుకున్నారు. వాటినే ఆమోదించిన బిల్లులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఖర్చు చేసి.. అలా బిల్లు తీసుకునే పనులను వారే చేపట్టారు. నకిలీ బిల్లులు, బినామీల పేర్లతో రూ.కోట్లు గడించారు. హైదరాబాద్ జిల్లాలో జరిగిన రూ.23 కోట్ల చెల్లింపుల్లో చాలావరకు గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికలంటే పండగే.. ఎన్నికల నిర్వహణ ఖర్చుకు ఆడిట్ ఉండదనే కారణంతో పలువురు రిటర్నింగ్ అధికారులు(ఆర్వో), ఏఆర్వో, ఈఆర్వో, బల్దియా సర్కిల్ ఇంజినీర్లు, జోనల్ ఇంజినీర్లు, ఉపకమిషనర్లు బరితెగిస్తున్నారు. డ్రైవరు, పీఏ, కంప్యూటర్ ఆపరేటర్ల పేర్లతో గుత్తేదారుల అవతారం ఎత్తారు.
- ఉప్పల్: సర్కిల్లోని ఉన్నత స్థాయి ఇంజినీరు, మరో సహాయ ఇంజినీరు ఓ వ్యక్తిని బినామీగా పెట్టుకున్నారు. లెక్కింపు, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల పనులను సొంతంగా చేసి రూ.లక్షల్లో సంపాదించారు.
- శేరిలింగంపల్లి: ఓ ఇంజినీరు లెక్కింపు కేంద్రం టెంటుసామగ్రి, ఇతర పనులు కూకట్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ల పేరుతో చేశారు.
- అంబర్‌పేట: ఓ ఉన్నతాధికారి నకిలీ బిల్లులతో వచ్చిన సొమ్ముతోనే కారు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సర్కిల్ ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు భోజనాలు సరఫరా చేసినట్లు లెక్కలు చూపి భారీగా బిల్లులు పొందారు. బహదూర్‌పుర, కార్వాన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.
- జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో పని చేసే ఓఇంజినీరు గోషామహల్ సర్కిల్ ఇన్ఛార్జిగా ఉంటూ.. టెండర్లలో గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- టెండర్ల ద్వారా చేపట్టిన ఏ ఒక్క పనికి కూడా ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడం గమనార్హం. వీరు మాత్రం బిల్లులు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
- మలక్‌పేట: ఓ ఉన్నతాధికారి ఎన్నికల విధుల్లోని అధికారులు, సిబ్బందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. డ్రైవరు కుటుంబానికి చెందిన హోటల్ పేరుతో బిల్లులు తీసుకున్నారు. సర్కిల్ ఉన్నతాధికారి బినామీ పేరుతో స్టేషనరీ వ్యవహారాల కాంట్రాక్టు పనులు చేశారు.
ఎల్బీనగర్: హయత్‌నగర్ సర్కిల్ ఉన్నతాధికారి వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుడు జోనల్ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల పనుల్లో హవా చూపారు. స్టేషనరీ, భోజనాలు, తదితర పనులు చేసుకున్నారు. వ్యక్తిగత సహాయకుడు జోనల్లోని నియోజకవర్గాల పరిధిలో ఒకటి, రెండు పనులను చేజిక్కించుకుని నిధులు దారి మళ్లించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్‌హోల్.. నాణ్యత నిల్
[ 14-06-2024]
నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదనీటి నాలాల మ్యాన్‌హోళ్లు ఛిద్రమయ్యాయి. వాహనాల రాకపోకలతో ముక్కలయ్యాయి. కొన్నిచోట్ల మూతలు పూర్తిగా గల్లంతయ్యాయి. వాహనదారులు వాటిలో పడుతున్నారు. -
కవలలు.. చూసుకునేందుకు గొడవలు
[ 14-06-2024]
పిల్లల సంరక్షణ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఓ తల్లి తన కవల పిల్లలను చెరువులో పడేసి ఆత్మహత్యకు యత్నించింది. -
నగరాన చినుకులు
[ 14-06-2024]
మలక్‌పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. మలక్‌పేట్ న్యూ మార్కెట్లోకి మోకాలు లోతున వరద చేరింది. ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున వరద ప్రవహించింది. -
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగొద్దు
[ 14-06-2024]
వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్, స్వతంత్ర ఇంజినీర్ ఏఈకామ్ సీనియర్ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి బేగంపేటలోని మెట్రోరైలు భవన్లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. -
డ్రోన్లతో మందు.. ఇక వద్దు
[ 14-06-2024]
దోమల నియంత్రణకు ఉపయోగిస్తోన్న డ్రోన్లు నిరుపయోగంగా మారాయని, వాటికి చేస్తోన్న ఖర్చు వృథా అని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వాటి సేవలను రద్దు చేసింది. డ్రోన్లతో పిచికారీ చేస్తోన్న మందుతో దోమల కట్టడి సాకారం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోనల్ అధికారులు వెల్లడించారు. -
16 కేసులు.. 10 మారుపేర్లు
[ 14-06-2024]
హైటెక్ విధానంలో వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేసి.. ఆరుగురు యువతులను రక్షించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులున్నాయి. -
సిగరెట్ ఇవ్వకపోగా.. హేళన చేశాడని హత్యాయత్నం
[ 14-06-2024]
తాను అడిగితే సిగరేట్ ఇవ్వకపోవడమే కాకుండా నలుగురు ముందు తనను హేళన చేశాడని హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడిని నారాయణగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. -
బంతి పడకుండానే.. రూ.కోట్లు ఔట్
[ 14-06-2024]
క్రికెట్ ఆటలో బంతి పడితేనే బ్యాట్స్‌మెట్ ఔట్ అవుతాడు.. కానీ జీహెచ్ఎంసీలో బంతి పడకుండానే రూ.కోట్లు ఔట్ అయిపోతున్నాయి. ఏటా ఇదే వ్యవహారం సాగుతున్నా చూడీచూడనట్టు వదిలేస్తున్నారు. -
కిషన్‌రెడ్డిపైనే నగర వాసుల ఆశలన్నీ..!
[ 14-06-2024]
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన కిషన్‌రెడ్డి అందరూ ఊహించిన విధంగానే కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక నగర ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఆదరణ
[ 14-06-2024]
సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. బ్లిడ్జ్ ఎగ్జిబిషన్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (టీఎఫ్పీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల ‘ఫుడ్ ఎ ఫెయిర్’ (ఆహార ఉత్పత్తుల ప్రదర్శన)ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్రంభించారు. -
ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు
[ 14-06-2024]
ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు సాధించవచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. గోపన్‌పల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో గురువారం ఆయన నవోదయ విద్యాలయాల విద్యార్థుల పారా స్పోర్ట్స్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. -
ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలకు నూతన భవన నిర్మాణం
[ 14-06-2024]
నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నూతన భవనం నిర్మించే వరకు కూల్చవద్దంటూ పాఠశాల పూర్వ విద్యార్థుల డిమాండ్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. -
అంతర్జాతీయ పురస్కారానికి అమృతవల్లి
[ 14-06-2024]
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాశ్ సినర్జీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఎ.వి.ఎస్.డి.అమృతవల్లి అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు ‘మన సంస్కృతి’ సంస్థ (హైదరాబాద్) పరీక్ష సంచాలకుడు డా.అనిల్‌కుమార్ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. -
కిన్నెర మొగిలయ్యకు మంత్రి పొన్నం సన్మానం
[ 14-06-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళాకారుడు కిన్నెర మొగిలయ్య రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
మీసేవ కేంద్రంలో అదనపు వసూళ్లు
[ 14-06-2024]
నిర్దేశిత ఛార్జీలకు బదులు అదనంగా డబ్బులు వసూలు చేసిన మీసేవా కేంద్రానికి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నారు
[ 14-06-2024]
కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత, ఉపగ్రహాల సాయంతో ప్రజల వ్యక్తిగత గోప్యతను అమెరికన్ కార్పొరేట్ సంస్థలు హరిస్తున్నాయని, మానవ మెదడును తమ నియంత్రణలోకి తీసుకుని ప్రజల కోరికలు, సంకల్పాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయని వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని టార్గెటెడ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్థలం పరిశీలన
[ 14-06-2024]
బషీరాబాద్ మండల కేంద్రంలోని జీవన్గీ రోడ్డు మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని గురువారం తహసీల్దార్ వెంకటేష్, సహకార సంఘం ఉపాధ్యక్షులు అజయ్ ప్రసాద్ పరిశీలించారు. -
సమీకృతం అసంపూర్ణం.. సమస్యలు నిత్యకృత్యం
[ 14-06-2024]
తాజా కూరగాయలతో పాటు జిల్లా వినియోగదారులకు మాంసం, పాలు, పండ్లు ఒకే చోట విక్రయించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. -
శుభకార్యానికి వెళ్తూ.. ఇద్దరి దుర్మరణం
[ 14-06-2024]
శుభకార్యానికి ఆటోలో వెళ్తూ మార్గ మధ్యన ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ ఢీ కొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలైన సంఘటన వికారాబాద్ మండలంలోని చించల్‌పేట గేటు సమీపంలో గురువారం జరిగింది. -
మాటు వేస్తున్నాయి.. దాడి చేస్తున్నాయి
[ 14-06-2024]
దామగుండం అటవీ ప్రాంతంలో మూగ జీవాలు శునకాల దాడిలో తీవ్ర గాయాల పాలవుతున్నాయి. కొన్ని మృత్యువాత పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా జింకలే ఎక్కువగా ఉండటం గమనార్హం. -
వ్యాయామ అధ్యాపకులు.. ఒక్కరూ లేరు!
[ 14-06-2024]
క్రీడలు మానసిక, శారీరక ద్రుఢత్వానికి దోహదపడతాయని పలు సందర్భాల్లో నేతలు వల్లె వేస్తుంటారు. కళాశాలలో, పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న వారు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచిస్తుంటారు.