logo
Published : 27 Nov 2021 01:02 IST

ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభంపై వివరణ ఇవ్వండి

ఈనాడు, హైదరాబాద్‌: మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌) రెండో దశలో 62 కిలోమీటర్ల మేర రైల్వేలైను నిర్మాణం పూర్తయినప్పటికీ రైళ్లను నడపకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వేతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైల్వేలైను పూర్తయినా రైళ్లు నడపకపోవడాన్ని సవాలు చేస్తూ సీపీఐ(ఎం) హైదరాబాద్‌ నగర కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు వ్యయం భరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మధ్య వివాదం కారణంగా ఇది ప్రారంభం కాలేదన్నారు. రైళ్లను ప్రారంభించకపోవడంతో ఇప్పటికే ఖర్చు చేసిన రూ.808 కోట్లు వృథా అయ్యాయన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే ఏడాది మార్చి 11కు వాయిదా వేసింది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని