logo
Updated : 27/11/2021 02:15 IST

యువత రాజకీయాల్లోకి రావాలి

ఓయూలో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో ఈటల


ప్రమాణం చేస్తున్న ఈటల, అమర్‌, ప్రతినిధులు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: నేటి యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఈటల రాజేందర్‌ అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతోపాటు యువతపై ఉందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భవిష్యత్‌ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ మాక్‌ అసెంబ్లీని శుక్రవారం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఈటల రాజేందర్‌, గవర్నర్‌ పాత్రను ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌, స్పీకర్‌గా రజనీకాంత్‌, సాయికృష్ణ, దేవికారెడ్డి పోషించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేశారు. వారితోపాటు వివిధ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు పి.మురళీ మనోహర్‌, ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌, రాణి రుద్రమదేవి, పేరల శేఖర్‌రావు తదితరులు ప్రసగించారు. దేవులపల్లి అమర్‌ దేశంలోని గవర్నర్‌ వ్యవస్థ, విధులు వివరించారు.

ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. చాయ్‌వాలాను దేశ ప్రధానిగా చేసిన ఘనత దేశ ప్రజలకు చెందుతుందని తెలిపారు. తెరాస ప్రభుత్వం అధికారం ఉందని హుజూరాబాద్‌లో రాజ్యాంగ విలువలు పాటించలేదన్నారు. హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పారు. యువకులు కలిసికట్టుగా ఉండాలని లేదంటే అణిచి వేయడానికి ప్రయత్నిస్తారన్నారు. ప్రజలు ఓటు వేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులు తరువాత వారిని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల కోసం, నాయకుల కోసం పాలన కాకుండా ప్రజలకు సేవా చేసేలా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. వారికి మంత్రులుగా వ్యవహరించిన వారు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో విలువలు పాటించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వాటిని పరిశ్రమలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన విద్య, అరోగ్యం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని