icon icon icon
icon icon icon

ఎన్నికల బరిలో కోటీశ్వరులు

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో చాలామంది కోటీశ్వరులే. వీరిలో కొద్దిమందికి తమ పేర, కుటుంబసభ్యుల పేరిట స్థిర, చరాస్తులు రూ.కోట్లలోనే ఉండటం గమనార్హం.

Updated : 21 Nov 2023 14:20 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో చాలామంది కోటీశ్వరులే. వీరిలో కొద్దిమందికి తమ పేర, కుటుంబసభ్యుల పేరిట స్థిర, చరాస్తులు రూ.కోట్లలోనే ఉండటం గమనార్హం. రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించిన నామినేషన్లలో అభ్యర్థులు ఈ మేరకు తమ ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో భారాస నుంచి పోటీ చేస్తున్న మర్రి జనార్దన్‌రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.112.23 కోట్లతో ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా నారాయణపేట భారాస అభ్యర్థి ఎస్‌.రాజేందర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిపి రూ.110.15 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిపి రూ.73.60కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిపి రూ.63.58కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులున్నాయి. వీరితోపాటు పలువురు అభ్యర్థులు రూ.కోట్ల ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. వీరిలో పలువురు గుత్తేదారులుగా, విద్యాసంస్థల అధిపతులుగా, వస్త్ర వ్యాపారులు, స్థిరాస్తి రంగాలకు చెందిన వారు ఉన్నారు.


నియోజకవర్గం: కొల్లాపూర్‌  

అభ్యర్థి: బీరం హర్షవర్ధన్‌రెడ్డి (భారాస)

కొల్లాపూర్‌ నియోజకవర్గం భారాస అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆయన భార్య విజయకు కలిపి మొత్తం రూ.11.82 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.3.05 కోట్ల బ్యాంకు రుణాలు / అప్పులు ఉన్నాయి.


నియోజకవర్గం:  వనపర్తి  

అభ్యర్థి: మేఘారెడ్డి(కాంగ్రెస్‌)

వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి మేఘారెడ్డి, ఆయన భార్య శారద పేరు మీద కలిపి మొత్తం రూ.18.15కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.3.40కోట్ల బ్యాంకు రుణాలు/ అప్పులు ఉన్నాయి. వీరి కుటుంబ సభ్యులు నవనీత్‌ రెడ్డి, మనోజ్‌ రెడ్డిల పేరు మీద మరో రూ.50 లక్షల ఆస్తులు ఉన్నాయి.


నియోజకవర్గం: నాగర్‌కర్నూల్‌

అభ్యర్థి: మర్రి జనార్దన్‌ రెడ్డి(భారాస)

భారాస నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, భార్య జమున పేరు మీద కలిపి మొత్తం రూ.112.23 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద మొత్తం రూ.26.52 కోట్లు బ్యాంకు రుణాలు/ అప్పులు ఉన్నాయి. ఈయనకు వస్త్ర దుకాణ వ్యాపార సంస్థలు ఉన్నాయి.


నియోజకవర్గం:  వనపర్తి  

అభ్యర్థి: నిరంజన్‌రెడ్డి (భారాస)

భారాస నుంచి వనపర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆయన భార్య వాసంతి పేరు మీద కలిపి మొత్తం రూ.7.98కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. మంత్రి పేరు మీద రూ.1.06కోట్ల బ్యాంకు రుణాలు / అప్పులు ఉన్నాయి.


నియోజకవర్గం: నారాయణపేట  

అభ్యర్థి: ఎస్‌.రాజేందర్‌ రెడ్డి(భారాస)

భారాస నారాయణపేట నియోజకవర్గం అభ్యర్థి ఎస్‌.రాజేందర్‌రెడ్డి, భార్య స్వాతిరెడ్డి పేరు మీద కలిపి మొత్తం రూ.110.15 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. రూ.10.48కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయనకు రాయచూరులో విద్యా సంస్థలు ఉన్నాయి.


నియోజకవర్గం: కల్వకుర్తి  

అభ్యర్థి: కసిరెడ్డి నారాయణరెడ్డి(కాంగ్రెస్‌)

కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆయన భార్య మాధవిరెడ్డికి కలిపి రూ.63.58కోట్ల విలువ చేసే చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.6.87 కోట్ల బ్యాంకు రుణాలు/ అప్పులు ఉన్నాయి. కసిరెడ్డి నారాయణరెడ్డి విద్యాసంస్థలకు అధిపతిగా ఉన్నారు.


నియోజకవర్గం: మక్తల్‌  

అభ్యర్థి: జలంధర్‌రెడ్డి (భాజపా)

మక్తల్‌ నియోజకవర్గం భాజపా అభ్యర్థి జలంధర్‌రెడ్డి, ఆయన భార్య పద్మజ పేరు మీద రూ.45.89 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.8.86 కోట్ల బ్యాంకు రుణాలు / అప్పులు ఉన్నాయి. జలంధర్‌రెడ్డి గుత్తేదారుగా ఉన్నారు.


నియోజకవర్గం: దేవరకద్ర  

అభ్యర్థి: ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి(భారాస)

దేవరకద్ర నియోజకవర్గం భారాస అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య మంజులకి కలిపి మొత్తం రూ.73.60కోట్ల విలువ చేసే చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.7.38 కోట్ల బ్యాంకు రుణాలు/ అప్పులు ఉన్నాయి. గుత్తేదారుగా ప్రాజెక్టు పనులు చేపడుతారు.


నియోజకవర్గం:  జడ్చర్ల  

అభ్యర్థి: అనిరుధ్‌రెడ్డి (కాంగ్రెస్‌)

జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి అనిరుథ్‌రెడ్డి, ఆయన భార్య మంజుషకు కలిపి రూ.47.45కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయనకు కూడా వ్యాపారాలు ఉన్నాయి.


నియోజకవర్గం: జడ్చర్ల  

అభ్యర్థి: డా.లక్ష్మారెడ్డి (భారాస)

జడ్చర్ల నియోజకవర్గం భారాస అభ్యర్థి డా.లక్ష్మారెడ్డి, ఆయన భార్య శ్వేతకు కలిపి మొత్తం రూ.32.87 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.15.12 కోట్ల బ్యాంకు రుణాలు/ అప్పులు ఉన్నాయి.


నియోజకవర్గం: మహబూబ్‌నగర్‌  

అభ్యర్థి: శ్రీనివాస్‌ గౌడ్‌ (భారాస)

మహబూబ్‌నగర్‌ భారాస అభ్యర్థి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఆయన భార్య శారద పేరు మీద కలిపి రూ.23.10కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ.3.33కోట్ల బ్యాంకు రుణాలు/ అప్పులు ఉన్నాయి.


నియోజకవర్గం: మహబూబ్‌నగర్‌

అభ్యర్థి: యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి (కాంగ్రెస్‌)

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి యన్నెం శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన భార్య పేరు మీద రూ.4.84కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img