Samantha: అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత

తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 27 Apr 2024 10:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన మాటను గౌరవించే అభిమానులు ఉండడం అదృష్టమన్నారు హీరోయిన్‌ సమంత (Samantha). సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు. నా ఫ్యాన్స్‌లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ. వాళ్లను చూసి ఎన్నో విషయాలపై నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. కొత్త అంశాలపై అవగాహన వచ్చింది. నా మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమే. కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి నేనేం కోరుకోను. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట నా మాటను గౌరవించే వాళ్లు ఉండడం అదృష్టం. నా మనసుకు నచ్చిందిచేస్తాను. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా.. కాదా అని ఆలోచిస్తాను. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేరు. అందుకే నేనెప్పుడు మెంటల్‌ హెల్త్‌కు ప్రాముఖ్యతనిస్తాను. దానికోసం అవసరమైన వ్యాయామాలు చేస్తుంటాను’ అని చెప్పారు.

చివరిగా ‘ఖుషి’లో కనిపించి అలరించారు సమంత. ప్రస్తుతం ఆమె నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel) విడుదలకు సిద్ధంగా ఉంది. సమంతతో పాటు వరుణ్‌ధావన్‌ (Varun Dhawan) ఇందులో ప్రధానపాత్ర పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Citadel: Honey Bunny) పేరుతో స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని