icon icon icon
icon icon icon

Rajnath Singh: తెలంగాణలో అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తాం: రాజ్‌నాథ్‌సింగ్‌

తెలంగాణలో భాజపా అప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Published : 24 Nov 2023 16:55 IST

కీసర: తెలంగాణలో భాజపా అప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లిలో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప సభకు రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈసారి తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం. పదేళ్లలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు అనేక హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 27 ఏళ్లుగా గుజరాత్‌ను దేశంలోనే ఒక మోడల్‌గా అభివృద్ధి చేశాం. తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా? భారాస ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. భాజపా అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాజ్‌పేయీ నుంచి మోదీ వరకు భాజపా ప్రభుత్వాలు, నాయకులపై ఒక్క అవినీతి మచ్చ లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన భారాస ప్రభుత్వం.. మోసం చేసి పేపర్‌ లీకేజీలు చేసింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఏ ఒక్క దళితుడికి ఇవ్వలేదు’’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. మేడ్చల్‌ భాజపా అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img