పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్‌!

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు.

Published : 06 May 2024 00:08 IST

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. తన భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించిన ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. హవేరీలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో భాజపా డీకేపై విమర్శలు గుప్పించింది. 

కాంగ్రెస్‌ అభ్యర్థి వినోదా అసూతి తరఫున ప్రచారం చేసేందుకు డీకే శివకుమార్‌ కర్ణాటకలోని హవేరీకి వచ్చారు. కారు దిగగానే అదే పార్టీకి చెందిన ఓ స్థానిక నేత డీకే భుజంపై చేతులు వేయడానికి ప్రయత్నించారు. దీంతో కోపానికి గురైన ఆయన ఒక్కసారిగా కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!

ఈ వీడియోను భాజపా ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాల్వియా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసి శివకుమార్‌ ప్రవర్తనపై మండిపడ్డారు. ‘‘డీకే భుజంపై చేయి వేయడం ఆయన చేసిన నేరమా? కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ పార్టీ కోసం ఎందుకు పని చేయాలని అనుకుంటున్నారు?ఆ నాయకులు తిడతారు, కించపరుస్తారు, పోటీకి టికెట్లు మాత్రం ఇవ్వరు (కుటుంబ సభ్యులకే ఇస్తారు). అవినీతి సొమ్ము కోసమేనా? ఆత్మగౌరవం లేదా?’’ అంటూ ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని