Puri Musings: ఆ సిబిల్‌ స్కోర్‌ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్‌

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

Published : 06 May 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పూరి మ్యూజింగ్స్‌’ (puri musings) పేరుతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) యూట్యూబ్‌ వేదికగా ఆసక్తికర అంశాలు చెబుతుంటారు. వాటికి కొంతకాలం బ్రేక్‌ ఇచ్చిన ఆయన మళ్లీ ప్రారంభించారు. మునుపటిలానే విభిన్న టాపిక్స్‌ గురించి మాట్లాడుతున్నారు. తాజాగా.. ‘కర్మ’ (Karma)పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

‘‘కర్మ అంటే ఏంటి?దాని వెనుకున్న అంతరార్థం ఏంటి? అని ఆలోచిస్తుంటాం. అదేమీ పెద్ద థియరీ కాదు. కర్మను ఒక్క మాటలో వివరించాలంటే.. ఈ రోజు నాసిరక ఆహారం తింటే కడుపు రేపు అప్‌సెట్‌ అవుతుంది. అదే కర్మ. మనం చేసే ప్రతి యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇందులో మొదటి రకం: ఇన్‌స్టంట్‌ కర్మ. వెంటనే రియాక్షన్‌ కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా అరటిపండు తొక్కను రోడ్డుపై పడేస్తే ఎవరో తొక్కి కిందపడిపోతారు. దాన్ని చూసి నవ్వుకుంటూ నువ్వెళ్లి ఓ స్తంభాన్ని ఢీ కొడతావ్‌. ‘క్యూ’లో నిల్చోవాలంటే నీకు చిరాకు. వరుస క్రమంలో ఉన్న అందరినీ నెట్టుకుంటూ వెళ్లి ‘స్టార్‌బక్స్‌’లో కాఫీ తీసుకొస్తావ్‌. కానీ, ఆ కప్పు చేజారి కిందపడిపోతుంది. ‘కర్మ ఇన్‌ మీడియా’ అనేది మరో రకం. సోషల్‌ మీడియాలో ఓ నెగెటివ్‌ పోస్ట్‌ పెడతాం. లక్షలమంది మనల్ని తిడతారు’’

‘‘మూడో రకం.. ‘కార్మిక్‌ డెబిట్స్‌ అండ్‌ క్రెడిట్స్‌’. మనం చేసే ప్రతి కర్మకు డెబిట్స్‌, క్రెడిట్స్‌ ఉంటాయి. కర్మ స్థాయిని బట్టి అవి మన ఖాతాలో ఆటోమేటిక్‌గా పడిపోతాయి. అవి వెంటనే కనిపించవు. మెల్లగా పోగవుతూ ఉంటాయి. అలా ఏదో ఒక రోజు నీ సిబిల్‌ స్కోర్‌ చూస్తే జాతకం మొత్తం బయటపడుతుంది. అందుకే మనల్ని మోసం చేసినవాడు ఎక్కడికీ పోడు. ఇక్కడే దొరుకుతాడు. దానికి సమయం పడుతుందంతే’’

‘‘నాలుగో రకం.. ‘డాడ్జింగ్‌ కర్మ’. మనం ఏ కర్మ చేయకుండా ఉండలేం. అందుకే చేసేదేదో మంచి చేయాలి. ఒక్కోసారి దాని ఫలితాన్ని తక్షణమే చూడలేకపోవచ్చు. అవినీతికి పాల్పడితే అధికారులకు పట్టుబడతాం. హత్య చేస్తే ఏదో ఒక రోజు జైలుకెళ్తాం. ‘చెడ్డ పని చేసి భలే తప్పించుకున్నామే’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఐదో రకం: ‘పాస్ట్‌లైఫ్‌ కర్మ’. పాస్ట్‌లైఫ్‌ (గత జన్మ)లో ఏం చేశామో మనకు తెలియదు. అప్పటి తప్పులు ఇప్పుడు ప్రభావం చూపుతాయో లేదో కూడా తెలియదు. అందుకే ఈ లైఫ్‌లో జాగ్రత్తగా ఉన్నా చాలు’’ అని సలహా ఇచ్చారు.

వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని