icon icon icon
icon icon icon

TDP: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించండి.. ఈసీకి తెదేపా ఫిర్యాదు

రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ని విధుల నుంచి తప్పించాలని ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

Published : 22 Apr 2024 22:31 IST

విజయవాడ: రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని విధుల నుంచి తప్పించాలని ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం తెదేపా నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు ఇన్‌ఛార్జ్‌ డీజీపీ బాధ్యతలు అప్పగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.

‘‘జగన్‌ ప్రచార బస్సు డోర్‌ వద్ద ఉండాలని డీజీపీ ఎస్పీలకు చెప్పడం శోచనీయం. భద్రత పెంచితే సరిపోతుంది.. బస్సు డోర్‌ వద్ద ఉండాలని చెప్పడమేంటి? రాజేంద్రనాథ్‌రెడ్డి ఎన్నికలు సజావుగా నిర్వహించగలరా అన్నదే మా అనుమానం. కడప, పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగాలి. కడపలో పోటీ చేస్తున్న షర్మిలకు, ప్రచారం చేస్తోన్న సునీతకు రక్షణ కల్పించాలి. రాజేంద్రనాథ్‌రెడ్డిని మార్చకపోతే కేంద్ర బలగాలకు బాధ్యతలు అప్పగించాలి’’అని వర్ల కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img