icon icon icon
icon icon icon

జహీరాబాద్

Updated : 13 Apr 2024 14:00 IST

పార్లమెంటు నియోజకవర్గం

2008లో జరిగిన పునర్విభజనతో మెదక్ జిల్లాలో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. గతంలో ఇది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేది.
ప్రస్తుతం ఇది జనరల్ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్‌తో పాటు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్స్‌వాడ అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసిన బి.బి. పాటిల్‌ విజయం సాధించారు.

ప్రధాన పార్టీల నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు వీళ్లే!

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకుంటూ పైచేయి సాధించింది. నామినేషన్‌ ప్రక్రియ అనంతరం మరింత దూకుడుగా ప్రచారాన్ని చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పనితీరును వివరించి ఓటర్ల మనసు గెలుచుకునేలా ముందుకు వెళ్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ భాజపాలో చేరడం ఇతర ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్‌, భాజపాలో చేరారు. దీంతో భారాస ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్‌ని ఎంపికచేసింది. పార్టీకి పూర్వవైభవం సాధించేందుకు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కార్యకర్తలు, ముఖ్య నేతలను సార్వత్రిక సమరానికి సన్నద్ధం చేసే పనిలో అధిష్ఠానం నిమగ్నమైంది. నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించి రానున్న రోజుల్లో భారాస ప్రభుత్వం ఏర్పడుతుందని, అధైర్యపడవద్దని శ్రేణులకు భరోసా ఇస్తోంది.

భారాస నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన బీబీ పాటిల్‌ ఇటీవల భాజపాలో చేరి టికెట్‌ సాధించారు. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తలు, ముఖ్యనేతలను ఎన్నికల సమరానికి సమాయత్తం చేస్తున్నారు. మోదీతో పాటు భాజపా అగ్రనేతలను ఆహ్వానించి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నాలుగుచోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నామపత్రాల దాఖలు అనంతరం పూర్తిస్థాయి ప్రచారం చేసేందుకు బూత్‌, శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులకు తర్ఫీదునిస్తున్నారు.

  • గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్‌శెట్కార్‌ ఎంపీగా ఎన్నికయ్యారు.
  • 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన సురేష్‌శెట్కార్‌పై తెరాస అభ్యర్థి బీబీ పాటిల్‌ గెలుపొందారు.
  • 2019 ఎన్నికల్లోనూ బీబీ పాటిల్‌ విజయం సాధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img