Viveka Murder Case: వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 18 Dec 2023 00:24 IST

అమరావతి: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(YS Viveka) కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఈ ముగ్గురిపై కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పులివెందుల కోర్టులో 2021 ఫిబ్రవరిలో పీఏ కృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు(YS Viveka Murder Case) విచారణ సమయంలో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తనను వేధించారని కృష్ణారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. సునీత, రాజశేఖర్‌ చెప్పినట్లు వ్యవహరించాలని రామ్‌సింగ్‌ బెదరించారన్నారు. కృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు.. చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని