Gaddar: మహాబోధి పాఠశాలలోనే ప్రజాగాయకుడు గద్దర్‌ అంత్యక్రియలు

గద్దర్‌కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాల ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్‌ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు  చేస్తున్నారు.

Updated : 06 Aug 2023 22:25 IST

హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు. పలువురు రాజకీయ నాయకులు, ఉద్యమ సంఘాల నాయకులు, సీనియర్‌ పాత్రికేయులు, కళాకారులు.. గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం ఉదయం వరకు ఆయన భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

పేద విద్యార్థుల కోసం సికింద్రాబాద్‌ అల్వాల్‌లో మహాబోధి పాఠశాలను నెలకొల్పారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు పేద విద్యార్థులకు విద్యనందించాలనే లక్ష్యంతో ఆయన ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని సిబ్బంది తెలిపారు. గద్దర్‌ మరణ వార్త విని మహాబోధి సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. గద్దర్‌కు అత్యంత ఇష్టమైన మహాబోధి పాఠశాల ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్‌ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మేడ్చల్‌ డీసీపీ శబరీష్ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని