Viral Video: ‘రాత్రికి రాత్రే పాపులరిటీ కోసం.. నడిరోడ్డుపై వెర్రి చేష్టలా?’

ఓ యువతి రోడ్డు మధ్యలోకి వచ్చి డ్యాన్స్‌ చేసిన వీడియోపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో!? అంటూ ట్వీట్‌ చేశారు.

Updated : 10 Feb 2024 12:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో లైక్స్‌, కామెంట్స్‌, వ్యూస్‌ మోజులో కొందరు యువతీ యువకులు చేస్తోన్న విన్యాసాలు హద్దు మీరుతున్నాయి. ఇన్‌స్టాలో తమ రీల్స్‌ను వినూత్నంగా చిత్రీకరించాలన్న అత్యుత్సాహంతో అసలేం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. తాజాగా ఓ యువతి నడి రోడ్డుపై  డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో!?’’

- సజ్జనార్‌ 

ఈ వీడియోను పరిశీలిస్తే.. వాహనాలు వెళ్తున్న రోడ్డు మధ్యలోకి ఓ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. తన కాలేజీ బ్యాగ్‌ను రోడ్డుపై పడేసి నేలపై పడుకొని స్టెప్పులు వేస్తుంది. రోడ్డుపై సిగ్నల్‌ పడి ఆటోలు, బస్సులు ఆగడంతో కెమెరా వైపు చూస్తూ నృత్యం చేస్తుంటుంది. 23 సెకెన్ల పాటు ఉన్న ఈ రీల్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి ప్రవర్తన పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు