Viveka Murder case: అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జూన్‌5కు వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్ర తెలిపారు.

Updated : 28 Apr 2023 16:38 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్ర తెలిపారు. ఇవాళ వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలు కాదన్నారు. రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్‌ 5కు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. సీబీఐ అరెస్టు చేసే అవకాశముందని, వేసవి సెలవుల కోర్టులో విచారణ జరపాలని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టు జడ్జికి నివేదించారు. అత్యవసరం అనుకుంటే ప్రధాన న్యాయమూర్తిని కోరాలని సూచించారు.

సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా రెండు వారాలైనా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి న్యాయవాది విన్నవించగా.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారణకు అనుమతించాలని హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. హడావుడిగా నిర్ణయం తీసుకోలేమన్నారు. విచారణకు అనుమతిపై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టునే కోరాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని