
Updated : 01 Apr 2021 21:13 IST
కామారెడ్డి కోర్టులో కరోనా కలకలం
కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కోర్టులో కరోనా కలకలం రేగింది. కొవిడ్ లక్షణాలతో న్యాయవాది మృతి చెందారు. బీబీపేట మండలానికి చెందిన న్యాయవాది బుధవారం అస్వస్థతకు గురి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం మృతి చెందారు. మరణించిన తర్వాత కొవిడ్ పరీక్ష నిర్వహించడంతో న్యాయవాదికి పాజిటివ్‌గా తేలింది. కామారెడ్డి న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురికీ కొవిడ్ నిర్ధారణ అయింది. వారిలో ఒక క్లర్క్, కానిస్టేబుల్, మరో న్యాయవాది ఉన్నారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :