Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Updated : 23 Sep 2023 22:33 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శనివారం కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెదేపా ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని పాల్గొని ఐటీ ఉద్యోగులకు సంఘీభావంగా రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 42 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకి పంపించారని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన వల్లే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు విడుదల అయ్యే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సుహాసిని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని