- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
అనితరసాధ్యుడు కాకర్ల..
సామాన్యుడి నుంచి మహోన్నత వ్యక్తిగా..
ఇంటర్నెట్ డెస్క్: లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. తప్పకుండా సాధించగలననే నమ్మకం.. అందుకోసం ఎంతకైనా తెగించే ధైర్యం.. ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే మనస్తత్వం.. సొంతలాభం కొంత మానుకొని సమాజ సేవకు పాటుపడాలన్న నిస్వార్థ గుణం పద్మశ్రీ, ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావును అత్యున్నత కీర్తిశిఖరాలకు చేర్చాయి. తెలుగు జాతి గర్వించే వైద్య శిఖామణిగా తీర్చిదిద్దాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో 1925 జనవరి 25న కాకర్ల సుబ్బారావు జన్మించారు. ఊళ్లో పాఠశాల లేకపోవడంతో ఇంటి వరండాలోనే పాఠశాలను ఏర్పాటుచేయించారు సుబ్బారావు తండ్రి. ఏడో తరగతి వరకు సుబ్బారావు అక్కడే చదువుకున్నారు. అనంతరం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో పూర్తిచేశారు.
ఇంజినీర్ కావాలనుకొని డాక్టర్‌గా..
కాకర్ల సుబ్బారావు ఇంజినీర్ కావాలనుకొని డాక్టర్ అయ్యారు. వైద్య వృత్తి చేపట్టాలని ఎప్పుడూ అనుకోలేదట. తల్లిదండ్రులకు కూడా అది ఇష్టం లేదట. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకుంటే సీటు రాలేదు. దీంతో నిరాశ చెందిన సుబ్బారావు అప్పటికే తెప్పించి పెట్టుకున్న దరఖాస్తు ద్వారా ఎంబీబీఎస్‌కు అప్లై చేశారు. సీటు రావడంతో ఇంట్లో చెబితే వద్దంటారేమోనని ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వెళ్లి మెడిసిన్‌లో చేరారు. ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో అధికారులు నిరాకరించారు. యాదృచ్ఛికంగా 1951లో రేడియాలజీ చదివేందుకు అమెరికా వెళ్లారు. వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకుంటూ వైద్య విద్యలో నైపుణ్యం సాధించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తిచేశారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీలో ఫెలోషిప్ కూడా పూర్తిచేశారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చారు.
14 ఏళ్లపాటు ఉస్మానియాలో విధులు
1956లో స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో చేరి, ఐదేళ్లలోనే ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. చీఫ్ రేడియాలజిస్ట్‌గా పనిచేశారు. మొత్తం 14 ఏళ్లపాటు ఉస్మానియాలో విధులు నిర్వర్తించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తిరిగి అమెరికా వెళ్లారు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లి జన్మభూమికి సేవ చేసేందుకు ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రావాలని పిలుపునివ్వడంతో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు మాతృభూమికి సేవచేయాలని స్వరాష్ట్రానికి తిరిగివచ్చారు. ఇక్కడ పరిస్థితులు బాగోలేక మళ్లీ తిరిగి వెళ్లిపోయారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి వెళ్లి భారత్‌కు తిరిగివచ్చి ఇక్కడ సేవ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో కాకర్ల మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చారు.
పేదలకు అధునాతన వైద్యం అందించాలనే లక్ష్యం
పేదలకు అధునాతన వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)ని అత్యున్నత స్థాయి వైద్యసంస్థగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ ఆసుపత్రులకే నమూనాగా మలిచారు. సామాన్యులకు ప్రపంచస్థాయి వైద్యాన్ని పరిచయం చేశారు. దూర ప్రాంతాల్లోని రేడియాలజిస్టులకు ఉపయుక్తంగా ఉండేలా కాకర్ల సుబ్బారావు రేడియోలాజికల్ ఎడ్యుకేషనల్ సైన్సెస్ ట్రస్ట్‌ను ఆరంభించారు. దీనికి తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారు. రేడియాలజీలో పలు పుస్తకాలను రచించారు. పలు వైద్య పత్రికలకు సంపాదకత్వం వహించారు.
తానా వ్యవస్థాపక అధ్యక్షుడిగా..
అమెరికాలోని తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని కాకర్ల పలువురితో చర్చించారు. ఇది తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆవిర్భావానికి దారితీసింది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో సుబ్బారావుకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. కలాం సేవాదృక్పథం, స్ఫూర్తినిచ్చే జీవన విధానం ఎంతగానో నచ్చేవి. ఇదే ఆయనను కలాంకు అభిమానిగా మార్చేసింది. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ross Taylor : ఆ స్టార్ క్రికెటర్‌ను మా దేశం తరఫున ఆడమని కోరా: కివీస్ మాజీ బ్యాటర్
-
Movies News
Vijay Deverakonda: ఆ విషయంలో నాకు ఏడుపొస్తుంది: విజయ్ దేవరకొండ
-
General News
Andhra News: స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. 175 మంది ఖైదీల విడుదల
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Khammam: కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి
-
Sports News
MS Dhoni : ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్ ‘టైమ్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ