Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Mar 2024 21:07 IST

1. అవినీతి పునాదులపై భారాస నిర్మాణం: పొన్నం ప్రభాకర్‌

నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే భారాస కుప్పకూలుతోందని వ్యాఖ్యానించారు. జహీరాబాద్‌లో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పునాదులపై భారాస పార్టీని నిర్మించారని విమర్శించారు. పూర్తి కథనం

2. మహిళల వేషధారణలో పురుషులు.. హోలీ పండక్కి విభిన్నమైన ఆచారం!

హోలీ అంటే.. కాముని దహనం, రంగులు చల్లుకోవడమే అందరికీ తెలిసింది. కానీ, కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామస్థులు ఈ పండుగకు విభిన్నమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. హోలీ రోజున పురుషులు.. మహిళల వేషధారణలోకి మారిపోతారు. చీరలు కట్టుకుని ఆభరణాలు, పూలతో సింగారించుకుంటారు. పూర్తి కథనం

3. వైద్యారోగ్యశాఖలో పెండింగ్‌ పోస్టుల భర్తీకి కసరత్తు

వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఇన్‌ఛార్జ్‌ డీఎంఈగా వాణీదేవి నియామకంపై స్పందించిన హైకోర్టు పూర్తిస్థాయి డీఎంఈని నియమించాలని ఆదేశించింది. దీంతో త్వరలోనే డీఎంఈ సహా డీపీఏ, డీసీహెచ్‌, కమిషనర్‌, టీవీవీపీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి కథనం

4. భాజపా తరపున పోటీ అతిపెద్ద బాధ్యత: అరుణ్ గోవిల్

రామాయణం సీరియల్ లో రాముడి పాత్రను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు అరుణ్ గోవిల్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆదివారం ప్రకటించింది. అరుణ్ గోవిల్ తన స్వస్థలమైన మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారని భాజపా స్పష్టంచేసింది. పూర్తి కథనం

5. కేజ్రీవాల్‌ అరెస్టుపై ఆప్‌ సోషల్‌ మీడియా ‘డీపీ క్యాంపెయిన్‌’

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము సాగిస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు కోరుతూ సోషల్‌ మీడియా ‘డీపీ క్యాంపెయిన్‌’ను ప్రారంభించింది. పూర్తి కథనం

6. కాంగ్రెస్‌ ఆరో జాబితా.. అమేఠీ, రాయ్‌బరేలీపై వీడని సస్పెన్స్‌

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ ఆరో విడత అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్‌లోని నాలుగు, తమిళనాడులోని ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా స్థానంలో భాజపా మాజీ నేత ప్రహ్లాద్‌ గుంజాల్‌ను బరిలోకి దించింది. పూర్తి కథనం

7. వైదొలిగిన బోయింగ్‌ సీఈఓ.. ఆ ప్రమాదమే కారణమా?

అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ సీఈఓ డేవ్ కాల్హౌన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు  ప్రకటించారు. ఈ ఏడాది చివరికి ఆయన తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం

8. ‘అరుణాచల్‌’పై చైనా మొండి వాదన.. నెలలో నాలుగోసారి!

అరుణాచల్‌ ప్రదేశ్‌పై మొండి వాదన చేస్తోన్న చైనా.. ఇటీవల మరింత నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్‌ తోసిపుచ్చుతున్నప్పటికీ.. డ్రాగన్‌ మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ దీటుగా సమాధానం ఇచ్చిన తరుణంలో చైనా మరోసారి స్పందించింది. పూర్తి కథనం

9. ఐపీఎల్ 2024.. పూర్తి షెడ్యూల్ విడుదల.. చెన్నైలో ఫైనల్‌

ఐపీఎల్‌ 2024 పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌, రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు చెన్నైలో నిర్వహిస్తుండగా.. తొలి క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్నాయి. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పూర్తి కథనం

10. ఎన్నికల తర్వాత ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ల పెంపు..!

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తమ టారిఫ్‌లను సవరించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈవిషయంలో అగ్రగామి సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియో తమదైన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నాయి. తమ ప్లాన్‌ ధరలను పెంచడం ద్వారా ఒక యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని ఎయిర్‌టెల్‌  భావిస్తోంది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని