Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Twitter: మరో ఆరు వారాల్లో ట్విటర్‌కు కొత్త సీఈఓ: ఎలాన్ మస్క్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ సీఈఓగా కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భారీ పేలుళ్లకు పథక రచన !
ఇటీవల పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన హిజ్బ్ ఉత్ తహరీర్(హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థ సభ్యుల వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితులు భారీఎత్తున పేలుళ్లకు పథక రచన చేశారని, ఇందుకోసం మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు గుర్తించారు. తొలి దశలో యువతని ఆకర్షించి తమవైపు తిప్పుకొంటారు. రెండో దశలో వారికి సాంకేతికత, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో దాడులు చేయిస్తారు. మొత్తంగా మూకుమ్మడి దాడులతో భయానక పరిస్థితిని సృష్టించేందుకు పథకం వేసినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆదాయం తక్కువున్నాఆర్థిక విజయం సాధించేలా..
‘నా జీతం చాలా తక్కువ. ఇక ఆర్థిక ప్రణాళికలు ఎలా వేసుకోవాలి?’ చాలామంది అడిగే ప్రశ్నే ఇది. ఆర్థిక ప్రణాళికలు అధిక ఆదాయం ఉన్న వారికే అని చాలామంది అనుకుంటారు. కానీ, వాస్తవం వేరు. వచ్చిన ఆదాయాన్ని ఎలా వినియోగిస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానం. అందుకోసం ఏం చేయాలి? తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సికింద్రా‘బాధ’ చర్లపల్లితో ఉపశమనం
నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ మూడు స్టేషన్ల నుంచి నిత్యం 443 రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 235 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ 10 ప్లాట్‌ఫాంలున్నాయి. ప్రయాణికులు 1.80 లక్షలు. నిత్యం రద్దీగా కనిపించే ఈ స్టేషన్‌లో రైలెక్కాలన్నా.. దిగాలన్నా ఇబ్బందే. పండగలు, వేసవి సెలవులు వచ్చాయంటే ప్లాట్‌ఫామ్స్ ఖాళీగా ఉండవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను బయటే ఆపాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమైన చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మీకు ఓట్లేసి తప్పు చేశాం
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మా గ్రామానికి వచ్చావు.. మళ్లీ ఎన్నికల సమయంలో వస్తావా.. అంటూ కృష్ణా జిల్లా మొవ్వ మండలం సూరసానిపల్లె ఎస్సీ వాసులు పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్‌కుమార్‌ను నిలదీశారు. బుధవారం రాత్రి మొవ్వపాలెంలో ఒక ప్రారంభోత్సవానికి వెళ్తుండగా మహిళలు మొవ్వలో ఎమ్మెల్యే కారును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. చరవాణి పోయిందా.. దొరుకుతుంది!
చరవాణి.. జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతికత కారణంగా మాట్లాడటానికే కాదు.. సమాచారం తెలుసుకోవాలన్నా.. నగదు చెల్లింపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు.. ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా.. దీనిపైనే ఆధారపడుతున్నాం. అలాంటిది చోరీకి గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనవసరం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం కొత్తగా సీఈఐఆర్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కొండగట్టుకు ఉత్సవ శోభ
మల్యాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు(12 నుంచి 14 వరకు) హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల ప్రారంభంలో భాగంగా గురువారం సాయంత్రం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సాయంత్రం పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మనసుతో కథలు చెప్తోంది....
తాతయ్య అమ్మమ్మల జీవిత ప్రయాణం, ఒడుదొడుకుల్ని ఎదుర్కొని విజయం సాధించిన యువకుని కథ, క్యాన్సర్ నుంచి కోలుకున్న ఓ యువతి గాథ.. ఇలా తరచి చూస్తే ప్రతి ఒక్కొరి జీవితంలో ఒక్కో మలుపు. అవన్నీ విన్నప్పుడూ, చూసినప్పుడు మనకేమనిపిస్తుంది.. గుండెలు బరువెక్కుతాయి.. స్ఫూర్తి రగిలిస్తాయి కదా! అలాంటి భావనే భోపాల్‌కు చెందిన ‘ద్రిష్టి సక్సేన’కు రోడ్డు పక్కన ఛాయ్ అమ్ముకునే మహిళతో మాట్లాడినప్పుడు కలిగింది..ఇటువంటి వారి జీవిత కథలను ఒకే వేదికపైకి ఎందుకు తేకూడదూ అనుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. స్ప్రే కొడతారు.. సొమ్ము దోచుకుంటారు
బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుని వెళ్లే అమాయకులనే లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఈ ముఠా అమాయకుల నుంచి రూ.10 లక్షలకు పైగా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. శాలిగౌరారం మండల కేంద్రంలో ఓ మహిళ రూ.1.50 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా గమనించిన దుండగులు ఆమె మెడపై గోకుడు వచ్చే స్ప్రే కొట్టారు. దీంతో ఆమె చేతిలో ఉన్న డబ్బుల సంచి పక్కన బెట్టి తేరుకునేలోపు నగదుతో పరారయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఉక్రెయిన్ ఎంబీబీఎస్ విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్
కొవిడ్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతూ భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులు రెండేళ్ల ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య సంఘం తెలిపింది. 2022 జులై 28న జారీ చేసిన పబ్లిక్ నోటీసులోని రెండేళ్ల ఇంటర్న్‌షిప్ నిబంధన కేవలం వీరికే వర్తిసుందని స్పష్టం చేసింది. ఈ విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్‌ఎంజీ) పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత రెండేళ్లపాటు మెడికల్ కాలేజీతో అనుసంధానమైన ఆసుపత్రిలో కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ (సీఆర్‌ఎంఐ) చేయాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం