Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 May 2024 16:59 IST

1.  తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్‌ కోసం ‘లావా’ బాస్‌ నిర్వాకం

మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌పై ఉన్న ఓ హై ప్రొఫైల్‌ నిందితుడి వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు ఎయిమ్స్‌ (AIIMS)కు వెళ్లారు. నాలుగు గంటల పాటు ఎదురుచూసినా అతడు కన్పించకపోవడంతో ఇక రాలేదని ధ్రువీకరించుకునేందుకు డాక్టర్‌ ఛాంబర్‌కు వెళ్లారు. పూర్తి కథనం

2.  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం కురిసింది.పూర్తి కథనం

3. ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్‌ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్

ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా వెల్లడించడంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) ముందుంటారు. ప్రస్తుత ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేస్తున్న విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓవైపు అభినందిస్తూనే.. స్ట్రైక్‌రేట్‌ విషయంలో విమర్శలు గుప్పించడం గమనార్హం. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఇంకాస్త దూకుడుగా పరుగులు చేస్తే బాగుటుందనే సలహాలు ఇచ్చాడు.పూర్తి కథనం

4. అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం: జీవన్‌రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణమన్నారు.పూర్తి కథనం

5. 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతోంది.పూర్తి కథనం

6. హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదు: కిషన్‌రెడ్డి

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.పూర్తి కథనం

7. టీమ్‌ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!

ఐపీఎల్ సందడి ముగియగానే మరో మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధం కానుంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్‌ వేదికగా టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అన్ని దేశాలు తమ టీమ్‌లను ప్రకటించాయి. భారత్‌ కూడా రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన టీమ్‌ను వెల్లడించింది. పూర్తి కథనం

8. రైతుబంధు పథకంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించాలి: వినోద్‌కుమార్‌

ఈ కేబినెట్‌ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్‌కుమార్ కోరారు. రైతుబంధు పథకం గురించి సమావేశంలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని ప్రధానితో సహా చాలా మంది స్వాగతించారని తెలిపారు.పూర్తి కథనం

9. స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన.. కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ అరెస్ట్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal) చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal aide Bibhav Kumar)ను నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా అతడిని అరెస్టు చేశారు. ​​​​​​​పూర్తి కథనం

10. నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్‌ మధుర జ్ఞాపకాలు

కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీకి సిద్ధమయ్యారు. ఆ ప్రాంతంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాహుల్‌కు సంబంధించిన వీడియోను హస్తం పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని