Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jun 2024 17:06 IST

1. ఆశీస్సుల కోసం అగ్ర నేతల ఇళ్లకు మోదీ

ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ (PM Modi).. భాజపా కురువృద్ధుడు ఎల్‌.కె.అడ్వాణీని (LK Advani) మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఆయన ఇంటికివెళ్లిన మోదీ... వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న విషయాన్ని ఆయనకు స్వయంగా చెప్పారు. పూర్తి కథనం

2.  హైదరాబాద్‌కు ‘ఎల్లో అలర్ట్‌’.. భారీ వర్షం కురిసే అవకాశం

ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. పూర్తి కథనం

3. సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  పూర్తి కథనం

4. బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ దర్శకులు.. ఫొటోలు వైరల్‌

నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్‌ దర్శకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆయన అక్కడ భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పూర్తి కథనం

5. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది.. కన్నప్ప టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన మంచు విష్ణు

అత్యంత భారీ నిర్మాణవ్యయం, అత్యాధునిక సాంకేతికతో రూపొందుతున్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. మంచు విష్ణు (Vishnu Manchu) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ టీజర్‌ను (Kannappa Teaser) విడుదల చేయనున్నట్లు కథానాయకుడు విష్ణు తెలిపారు.  పూర్తి కథనం

6. వారికి ప్రేక్షకుల మద్దతూ ఎక్కువే.. యూఎస్‌ఏ కెప్టెన్ మోనాంక్

టీ20 ప్రపంచకప్‌ 2024లో (T20 World Cup 2024) తొలి సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్‌ను యూఎస్‌ఏ చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. సూపర్ ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికానే విక్టరీ సాధించింది. బాబర్ అజామ్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు.  పూర్తి కథనం

7. టీ20 వరల్డ్‌ కప్‌.. ఎయిర్‌టెల్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ కొత్త ప్లాన్లు

టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్ ప్లాన్లను (Airtel Recharge Plans) తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌తో పాటు ఎక్స్‌ట్రీమ్ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్ల కోసం వీటిని ప్రవేశపెట్టింది. డిస్నీ+ హాట్‌స్టార్‌తో (Disney+ Hotstar) కూడిన ఈ ప్లాన్లు క్రికెట్‌ వీక్షించేవారిని దృష్టిలోఉంచుకొని రూపొందించినట్లు టెలికాం నిపుణులు తెలిపారు.  పూర్తి కథనం

8. హరియాణా దిల్లీకి నీటి విడుదలను తగ్గించింది: ఆప్ నేత ఆతిశీ

దిల్లీ ప్రజలపై హరియాణా(Haryana) ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ(APP) నేత ఆతిశీ(Atishi) ఆరోపించింది. ఇందులోభాగంగానే గత మూడు రోజులుగా దేశ రాజధానికి నీటి విడుదలను తగ్గించిందని పేర్కొన్నారు. దిల్లీకి 137 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించిన ఒకరోజు అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం

9. బాలీవుడ్‌పై కంగన ఫైర్‌.. కాసేపటికే పోస్టు డిలీట్‌

బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)ను చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న ఆమెకు ఈ అనూహ్య పరిణామం షాకిచ్చింది. పూర్తి కథనం

10. కాళేశ్వరం మరమ్మతు పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బ తిన్న చోట్ల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘ఎన్నికల కోడ్‌ వల్ల కాళేశ్వరంపై రివ్యూ జరగలేదు.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని